పార్లమెంట్ సభ్యునిగా టి.జీవన్ రెడ్డిని గెలిపించండి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్  

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీజీవన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ యందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు అని ఐదు పర్యాయాలు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసినరని, 20 19 ఏప్రిల్ నుండి శాసనమండలి సభ్యులుగా పనిచేస్తున్నారని, 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ప్రజల కొరకు పని చేస్తున్నారని అన్నారు .దేశంలో ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కొనసాగాలంటే బిజెపిని చిత్తుగా ఓడించాలని,,, గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేశామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్న ఒకే వ్యక్తి రాష్ట్రపతి ,,కానీ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, దేశాన్ని మతోన్మాదం వైపు నడిపించిన వ్యక్తికి భారతరత్న బిరుదు ఇవ్వడం, అతని ఇంటికి రాష్ట్రపతి వెళ్లి ప్రధానం చేయడం,, ముఖ్యమంత్రులను కూడా ఈడి దాడులతో అరెస్టు చేయించి జైలు పాలు చేయడం,, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసినారని,, తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళి సై తెలంగాణలో బిజెపి అభ్యర్థుల కొరకు ఎన్నికల ప్రచారం చేయడం ఇటువంటి సాంఘిక పద్ధతులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బిజెపి అభ్యర్థిని ఓడించాలని అన్నారు.. కేంద్ర బడ్జెట్ లో విద్యకు కేటాయింపులు క్రమంగా తగ్గించడం ,,ప్రభుత్వ విద్యారంగా సంస్థలను నిర్వీర్యం చేయడం, కేంద్ర విశ్వవిద్యాలయాలలో ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండా చేయడం తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేటీకరణను వేగవంతం చేయడం ద్వారా అందరికీ విద్య అందే పద్ధతి లేకుండా చేస్తున్నారని,, బడులను కళాశాలలను బాగు చేయకుండా విద్యా సంవత్సరం మొదటి నుండి చదువు చెప్పకుండా పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించడం మోడీకే చెల్లిందని అన్నారు.. ప్రస్తుత ఎంపీ ధర్మపురి తల తోక లేకుండా మాట్లాడే తీరు చూసామని ,ప్రజాస్వామ్య వాదులు ,,ప్రగతిశీలులు, రాజ్యాంగం రక్షించబడే వారందరూ టి జీవన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలని కోరినారు..ఈ విలేకరుల సమావేశంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి జిల్లా కో కన్వీనర్ షేక్ హుస్సేన్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నాయకులు ఈ వి ఎల్ నారాయణ,  నియోజకవర్గ కన్వీనర్ మూగ ప్రభాకర్,  డివిజన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాబా గౌడ్ కార్యదర్శి కృష్ణ గౌడ్, న్యాయవాది కృష్ణయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులు ప్రదీప్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love