ఆటల్లో గెలుపు ఓటములు సహజం ఎంజియూ: ప్రొఫెసర్ ఆకుల రవి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలలో భాగంగా డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చౌటుప్పల్ క్రీడా మైదానంలో శనివారం నాల్గోవ రోజు జరిగిన క్రికెట్ పోటీలో ఉదయం 9 గంటల సమయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వర్సెస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వర్సెస్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ సూర్యాపేట తలపడ్డాయి.ఈ మ్యాచ్ లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్,మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి సంజయ్ బౌలింగ్లో మూడు వికెట్లు తీసి 32 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన రెండవ మ్యాచ్లో జాగృతి డిగ్రీ కాలేజ్ వర్సెస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ తలపడ్డాయి.ఈ మ్యాచ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎనిమిది వికెట్లు తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి లోకేష్,బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.తదుపరి జరిగిన మూడో మ్యాచ్ రెండున్నర గంటలకు మొదలవగా కె ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ కోదాడ వర్సెస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట 7 వికెట్ల తేడాతో విజయం పొందింది.ఈ మ్యాచ్లో అఖిల్ మూడు వికెట్లు తీసి మాన్ అఫ్ ది మ్యాచ్ గెలుపొందాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజియూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి  క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు గెలుపు ఓటముల నుండి పొందిన అనుభవాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ & ఎంఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దిలీప్ కుమార్ ఫ్యాకల్టీ మెంబర్స జె.ప్రసాద్ రావు,విజయరాణి  పాల్గొన్నారు.
Spread the love