– భారత్‌తో టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు
లండన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో కీలక సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు సార్లు రన్నరప్ భారత్‌తో ఇంగ్లాండ్ ఐదు రోజుల సవాల్‌కు సిద్ధమవుతోంది. స్వదేశీ టెస్టు సిరీస్‌కు టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేయలేదు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఐదు టెస్టుల సిరీస్‌కు ఇప్పటికే జట్టును ఎంపిక చేసింది. 16 మందితో కూడిన బృందం భారత్‌కు రానుంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సారథ్యంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. పేసర్ అటిక్సన్ సహా స్పిన్నర్లు టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్‌లు తొలిసారి ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి వచ్చారు. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆరంభం కానుంది. రెండో టెస్టుకు విశాఖపట్నం వేదిక కానుండగా.. ధర్మశాల టెస్టుతో సిరీస్ ముగియనుంది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గస్ అటిక్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒలీ పోప్, ఒలీ రాబిన్సన్, జో రూట్, మార్క్‌వుడ్.