Monday, September 21, 2026
E-PAPER
Homeక్రైమ్వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన తిక్క రమ (55) వడదెబ్బతో మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం రమా ఆదివారం ఉదయం పిఏసిఎస్ వరిధాన్యం  కొనుగోలు కేంద్రంలో తమ వడ్లను నేర్పుతున్న క్రమంలో తలతిప్పి వాంతులు చేసుకొని కుప్పకూలినట్లుగా స్థానికులు తెలిపారు. అకాల వర్షాలు పడడంతో వడ్లు తడిసిపోయాయి. దీంతో ప్రతిరోజు రమ కుటుంబ సభ్యులతో కలిసి వడ్లను ఆరబెట్టడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు ఎండలో పనిచేయడం వల్ల ఆదివారం వడదెబ్బ తగిలి అక్కడే స్పృహ కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక వైద్యులకు చూపించి వెంటనే భూపాలపల్లిలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు హనంకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో కుటుంబంతోపాటు తాడిచర్ల గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -