నవతెలంగాణ – మల్హర్ రావు
దేశవ్యాప్తంగా డ్రగిస్ట్ అండ్ కెమిస్ట్ ఈ నెల 20న బంద్ పిలుపు మేరకు సోమవారం మండల మెడికల్ షాపుల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో తహశీల్దార్ రవికుమార్, కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై-2 రాజన్ కుమార్ లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు పెరుగుతున్నాయని, నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పేర్కొంటూ వాటిని తక్షణమే నిషేధించాలన్నారు. జాతీయ స్థాయి బంద్ పిలుపులో భాగంగా ఈ నెల 20వ తేదీ బుధవారం మండలంలోని అన్ని మెడికల్ షాపులను బంద్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ బంద్‌కు మండల ప్రజలు సహకరించాలని,అత్యవసర మందులు కొనుగోలు చేసుకోవాలని మండల కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో జంబోజు రవిందర్, కుక్కడపు అశోక్,వొన్న తిరుపతి రావు,శ్రీనాత్,శేఖర్,వెంకటేష్ పాల్గొన్నారు.
మెడికల్ షాపుల బంద్ పిలుపుపై తహశీల్దార్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



