మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: డీన్ హేమంత్ కుమార్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట
కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మహిళలు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని స్థినిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలను ములకలపల్లి కి చెందిన గుడ్ షెఫర్డ్ ఎన్జీవో  సంస్థ ద్వారా మహిళా రైతులు సందర్శించారు.సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్దతులు, అదనపు ఆదాయ మార్గాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, వారికి కళాశాల ప్రొఫెసర్లు శిక్షణ అందించారు.ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాల్లో విశేష గుర్తింపు సాధించాలని,వ్యవసాయ అనుబంధ రంగాలైన పుట్టగొడుగుల పెంపకం, వానపాముల ఎరువు తయారీ, జీవన ఎరువుల తయారీ, తేనెటీగల పెంపకం గురించి వివరించారు.ఈ కుటీర పరిశ్రమలను నిర్వహిస్తే మహిళలకు అదనపు ఆదాయం వస్తుందని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావొచ్చన్నారు.అనంతరం మహిళా రైతులు కళాశాలలోని కుటీర పరిశ్రమలను పరిశీలించి,అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కే గోపాలకృష్ణమూర్తి,దీపక్ రెడ్డి, శిరీష,టీ.పావని, పీ.శ్రీలత, పీ. రెడ్డిప్రియా, మహిళలు పాల్గొన్నారు
Spread the love