50 రోజులు నా గురించి కష్టపడండి.. 5 ఏళ్ళు మీ సేవలో ఉంటా

– మంత్రి హరీష్ రావు
– సిద్దిపేట లో  17 న జరిగే సీఎం కేసీఆర్ సభ కు జనసమీకరణ , సభా సమాయత్తం పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి 
నవతెలంగాణ – సిద్దిపేట
ఈ 50 రోజులు నా గురించి కష్టపడండి… 5 ఏళ్ళు మీ సేవలో ఉంటానని మంత్రి హరీష్ రావు  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట లో  17 న జరిగే సీఎం కేసీఆర్ సభకు జనసమీకరణ, సభా సమాయత్తం పై పార్టీ శ్రేణులతో మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో దేశ స్ధాయి లో సిద్దిపేట గౌరవాన్ని పెంచారని,  ఆదిశగా  అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో సిద్దిపేట ప్రతిష్టను పెంచానని అన్నారు.  సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులుగా , నేను సిద్దిపేట ప్రజల కుటుంబ సభ్యునిగా నిరంతరం అభివృద్ధి కి పాటు పడుతున్న అని, అందుకు సిద్దిపేట ప్రజలు అందిస్తున్న ప్రేమ ఆదరణను నా తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటానన్నారు. గత స్పూర్తితో అందరం కల్సి పని చేసి, బూత్ స్థాయి నుండే ప్రతి ఒక్కరినీ కలవాలని,  ప్రతి ఇల్లు తిరగాలని సూచించారు. ప్రతి ఇంట్లో సంక్షేమం ఉంది, ప్రతి ఊళ్ళో ప్రగతి ఉన్నదని ప్రజల్లో ఉండాలి మన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేయాలని తెలిపారు. 17 న సీఎం కేసీఆర్  సిద్దిపేట ఎన్నికల శంఖారవాన్ని పూరించనున్నారని అన్నారు. 17 సిద్దిపేట లో సాయంత్రం సీఎం కేసీఆర్ సభ ఉంటుందని, లక్ష మంది తో ‘ ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ ‘ నిర్వహిస్తుమని చెప్పారు.  సిద్దిపేట నాడు ఉద్యమం లో.. నేటి అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచామని చెప్పారు. సీఎం కేసీఆర్  ఆశీస్సులు, సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో 6 సార్లు గెలిపించారని, ఆ గెలుపుకు ప్రజల ఆలోచనలను అనుగుణంగా అభివృద్ధి చేసాము. అభివృద్ధి కోనసాగాలని కొరారు. సిద్దిపేట ప్రజల కలలను సాకారం అయిన వేళ లక్ష మంది తో  అద్భుతమైన అపూర్వ స్వాగతం పలకాలని, అందుకోసం మండలాల వారీగా జన సమీకరణ పై సమాయత్తం కావాలని కోరారు. గత ఎన్నికల్లో మా లక్ష్యం  లక్ష  మెజారిటీ… అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో   ఔర్  ఏక్ దక్కా…దేడ్ లాక్ పక్కా  ( ఎక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా)  అనే నినాదం తో పని చేస్తామని నాయకులు రాధాకృష్ణ శర్మ, రాజనర్సు, రవీందర్ రెడ్డి, చిన్నా, పాల సాయి రాం,  మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి ,  శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి , లింగం గౌడ్, ఎల్లారెడ్డి , ఎద్దు యాదగిరి , ఎర్ర యాదయ్య, శ్రీహరి గౌడ్ , ఉమా , జంగటి కనకరాజు , రాములు యాదవ్ తదితరులు మాట్లాడారు.  సమన్వయం తో అందరం కల్సి ఐక్యత తో   ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని ఇస్తామని చెప్పారు. మీరు 5ఏళ్ళు మా గురించి కష్ట పడ్డారు మేము ఒక హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్ష ల హరీశ్ అన్న దీక్ష నేటి నుండి 50 రోజులు దీక్ష లో ఉండి మీకు విజయ తిలకం దిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love