ప్రపంచ కార్మికులారా ఏకంకండి: చింతల నాగరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల

మండల కేంద్రంలో  అంతర్జాతీయ కార్మిక  దినోత్సవం మేడే సందర్భంగా సీఐటీయూ  జెండా పతకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ..1886 సంవత్సరం లో మే 1నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో రోజుకు 8 గంటల పని దినమును కార్మికులు పోరాడి సాధించుకున్న దినమే మేడే అని అన్నారు. కారల్ మార్క్స్ అందించిన పోరాడితే పోయేది ఏమిలేదు బానిస సంకెళ్లు తప్ప; అనే సమర నినాదంతో కార్మికవర్గం ఒక్కటై పోరాడినా దినమే మేడే అని అన్నారు. మేడే స్పూర్తితో కార్మికుల హక్కులకోసం పోరాడుతామన్నారు. ఈ మేడే కార్యక్రమం లో హమాలీ కార్మికులు జహంగీర్,రింబాబు,జంగయ్య, బాలకృష్ణ,బలరాం, ఆంజనేయులు, అర్జున్, శివ  రామస్వామి, మల్లేష్  రామచంద్రయ్య,  గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్  నాయకులు హాబీబ్, రాజలింగం, ఆటో యూనియన్, ఉపాధి కార్మికులు,సీఐటీయూ మండల నాయకులు  ఏ. రాములుకార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love