– సహాయ కార్మిక శాఖ అధికారి హేమలత…
నవతెలంగాణ – మంథని
కార్మికులు లేబర్ కార్డు పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగ చేసుకోవాలని సహాయ కార్మిక శాఖ అధికారి హేమలత పేర్కొన్నారు. బుధవారం ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ లేబర్ కార్డు జారీ విషయంలో కార్మిక శాఖలో అవినీతి జరిగేందుకు ఆస్కారం లేదని ఆమె తెలిపారు.మంథని కార్యాలయ పరిధిలో భవన నిర్మాణ,ఇతర కార్మికులకుదరఖాస్తు చేసుకునేందు సంక్షేమ పథకాల దరఖాస్తులు అన్నీ కేవలం మీ-సేవ ద్వారా మాత్రమే అమలు చేస్తున్నారని,ఎలాంటి మధ్యవర్తిత్వం ద్వారా దరఖాస్తు ప్రక్రియలు జరగవని ప్రజలు గమనించలని ఆమె కోరారు.మీసేవ ద్వారా నమోదు చేసుకొని అనంతరం అర్హులైన వారు6 నేరుగా మంథని సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని,దళారులను ఆశ్రయించకుండా దరఖాస్తు పత్రాలను కార్యాలయంలో ఇవ్వలని ఆమె సూచించారు.మంథని సహాయ కార్మిక శాఖ కార్యాలయం పరిధిలో దళారీ వ్యవస్థ లేదని ప్రజలు గమనించలని ఆమె కోరారు.భవన నిర్మాణ కార్మికులు నూతన దరఖాస్తు చేసుకునేందుకు రూ.110 ఫీజు మీ సేవలో చెల్లించి నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.నమోదు కాబడినటువంటి కార్మికులు ఐదు సంవత్సరాలు దాటకుండా నమోదును పునరుద్ధరించుకోవాలని ఆమె వివరించారు.పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో కార్మికులు సంప్రదించాలని ఆమె తెలిపారు.