వ్యవసాయ కళాశాలలో ఘనంగా ప్రపంచ మృత్తికా దినోత్సవం

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో మంగళవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట ఎస్.బి.ఐ బ్రాంచ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొని పలు బహుమతలను సాధించారు. మృత్తిక యెక్క ప్రాముఖ్యతను వివిధ ఆకృతులను, పోస్టర్లతో  విద్యార్థులు వివరించారు. బ్రాంచి మ్యానేజర్ టి.కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ హేమంత కుమార్ ప్రపంచ మృత్తికా దినోత్సవం పూర్వాపరాలు, మానవాళికి మృత్తికలకు ఉన్న సంబంధం గురించి,జీవన ఎరువుల యెక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. కళాశాల శాస్త్రవేత్తలు వై.గోపాల క్రిష్ణ మూర్తి, పావని, నీలిమ, ఝాన్సీ రాణి, స్రవంతి, రెడ్డి ప్రియ, కృష్ణ తేజ, జయమ్మ  పాల్గొన్నారు. కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Spread the love