– ఆయన మరణం పార్టీకి తీరని లోటు
– జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు యానాల రాధాకష్ణారెడ్డి (వైఆర్ కె రెడ్డి) మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం అనారోగ్యంతో మరణించిన వైఆర్‌కె రెడ్డి పార్థివ దేహం పై పార్టీ ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుమారు 3 దశాబ్దాల పాటు ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కషి చేశారని, చిన్ననాటి నుండి తుది శ్వాస విరిచే వరకు కమ్యూనిస్టు ఉద్యమాభివద్దికి నిరంతరం కషి చేసిన నిస్వార్థ కమ్యూనిస్టు అని కొనియాడారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగిన దీర్ఘకాలిక సమ్మెలలో, ప్రవేట్ సర్వీసులను ఆర్టీసీ స్వాధీనపర్చుకోవాలి అనే సాగిన ఉద్యమాలలో సమరశీలంగా పోరాడారని గుర్తు చేశారు. వారు సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులుగా, సీఐటీయూ జిల్లా కోశాధికారిగా, ఆర్టీసీ లో సీఐటీయూ అనుబంధ యూనియన్ ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో డిపో, రీజియన్, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతల్లో పని చేశారని గుర్తు చేశారు.వారిని ఇటీవల కాలంలో పరమార్శించడానికి వెళ్ళినప్పుడు గత జ్ఞాపకాలను నెమరువేస్తూ రాబోయే కాలంలో పార్టీ నిర్వర్తించే ఉద్యమాల గురించి సలహాలు సూచనలు చేశారని గుర్తు చేశారు. చిన్ననాటి నుండి కమ్యూనిస్టు పార్టీలో సీపీఐ(ఎం) లో చేరి నకరేకల్లు, నల్లగొండ ప్రాంతాలలో ఉద్యమ విస్తరణకు కషి చేశారని చెప్పారు.ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలతో పాటు కార్మిక ఉద్యమాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కషి చేయాలని పిలుపునిచ్చారు. వారికి నివాళులర్పించిన వారిలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎం డి. సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బిక్షం, తదితరులు పాల్గొన్నారు.
పలువురి సంతాపం
సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు వై ఆర్ కె రెడ్డి మరణం కార్మికోద్యమాలకు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీ నారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఉట్కూరి నారాయణరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మహిళ కార్మికుల జిల్లా కన్వీనర్ దండెం పల్లి సరోజ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాంబాబు, అధ్యక్ష కార్యదర్శులు బత్తుల సుధాకర్, కందుల నరసింహ సంతాపం తెలిపారు