అనాథ పిల్లలకు అండగా యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  అబిడ్స్ బొగ్గులకుంటలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ చెట్టు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై అనాధ పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు జనన కథను జీవితంలోకి తెచ్చే నాటకంతో పాటు చిన్నారులు ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంటా క్లాజ్ తో పిల్లల సంభాషణ, సెలబ్రేషన్ కు మరింత ఆనందం జోడించింది. సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళల పక్షాన యాంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ నిలబడుతుందని సంస్థ ప్రధాన కార్యదర్శి రాణి శేషాద్రి తెలిపారు. మహిళలలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను నైపుణ్యాలను బయటకుతీసే విధంగా తమ సంస్థ తొడుపడుతుందని అన్నారు. అంతేకాకుండా అనాదపిల్లలను చేరదీసి తమ సంస్థ ద్వారా విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవా ఆత్మ, సామాజిక సంఘటన స్పూర్తిని ప్రతిబింబించడంతో పాటు… తమ అసోసియేషన్ ద్వారా కరోనా సమయంలో  అనేక మందికి తోడ్పాటు అందించినట్లు రాణి శేషాద్రి  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఓం ప్రకాష్, యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు  పద్మ అలెక్స్, బోర్డు సభ్యులు మిస్సెస్ లేయా ప్రేమ లీల, శిమ్మి రవి, దయామరుత, రెండు వందల అనాథ పిల్లలు పాల్గొన్నారు.
Spread the love