
మండలంలోని చిన్నతుండ్ల గ్రామపరిదిలో నిర్వహించిన దుబ్బ జాతర కి వచ్చే సందర్శకులకు మంచినీటి ఇబ్బంది లేకుండా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ.కిశోర్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మినరల్ కూల్ వాటర్ ను అందించారు. ఇందుకు ఆలయ కమిటీ, పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు లోకే.సుధాకర్ రావు, లోకె. సతీ దేవి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు జక్కుల.వెంకట స్వామి, పిఏసిఎస్ డైరెక్టర్ ఇప్ప. మొండి యూత్ నాయకులు కీర్తి.రాములు,గయ్య్.నరేష్ ,గీట్ల.సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.