– అధ్యక్ష బరిలో కుంభం మహేష్ రెడ్డి
నవతెలంగాణ-మంథని
కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ అధ్యక్షుడిగా మల్హర్ మండలం కుంభంపల్లి గ్రామానికి చెందిన కుంభం మహేష్ రెడ్డి బరిలో నిలబడినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆశీర్వదించి గెలిపించినట్లయితే అందరికి అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కషి చేస్తానని మహేష్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడే ఈ అధ్యక్ష పోటీల్లో కార్యకర్తలు అందరూ తనకు మద్దతుగా యువకులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రోత్సహించాలని, ఆన్‌లైన్ ద్వారా తమకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో వచ్చేలా చూడాలని మహేష్ రెడ్డి కోరారు.