నవతెలంగాణ – శంకరపట్నం
మాదకద్రవ్యాల వినియోగం పట్ల విద్యార్థులు, యువత, అప్రమత్తంగా ఉండాలని,హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ అన్నారు. సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం బస్టాండ్ లో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మద్యం గంజాయి మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్ బారిన పడవద్దని ఆయన హెచ్చరించారు. వీటిని తీసుకోవడం వలన చట్టానికి వ్యతిరేకం మైన పనులు చేస్తున్నట్లని ఆయన అన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష 2 లక్షల రూపాయల జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు యువకులు తదితరులు పాల్గొన్నారు.