అభివృద్ధికి దిక్సూచి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి 

-కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వర్థంతి వేడుకలు 

నవతెలంగాణ-బెజ్జంకి : ముఖ్యమంత్రి హయాంలో ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా పనిచేసి..నీరుపెదలకు సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాల ఫలాలందించిన మహానీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. నాయకులు రత్నాకర్ రెడ్డి,శ్రావణ్,శ్రీనివాస్ రెడ్డి,మల్లేశం, రాంరెడ్డి తదితరులు హజరయ్యారు.
Spread the love