జీలుగ పంపిణీ ఎప్పుడో..?

– సొసైటీలకు చేరని సబ్సిడీ విత్తనాలు
– అదును దాటుతొందని రైతులు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు సబ్సిడీ జీలుగ విత్తనాలు సకాలంలో అందించే విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకు మండలంలో జీలుగ విత్తనాలు పంపిణీ చేయలేదు. సొసైటీలకు ఇంకా స్టాక్ రాలేదని, ఇంకా వారం రోజులు పడతుందని వ్యవశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వానాకాలం సీజన్ పనులు అలస్యయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నెలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువు కోసం రైతులు మే మొదటి వారంలోనే జీలుగ విత్తనాలను కొనుగోలు చేసి పొలాల్లో చల్లేవారు.తొలకరి వర్షాలకు పెరిగిన చెట్లను 40 రోజులకు ట్రాక్టర్ తో కలియ దున్ని నాట్లు వేస్తారు.కానీ జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు సొసైటీలకు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు.
500 మెట్రిక్ టన్నులు అబసరం..
మండలానికి 500 మెట్రిక్ టన్నుల జిలగ విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇప్పటి వరకు మండలానికి రాలేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు ఇక ఆలస్యం చేస్తే సొసైటీలకు సరఫరా చేసిన ప్రయోజనం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ మండల వ్యాప్తంగా 16 ఎకరాల్లో వరి సాగు కానుంది. కనీసం 10 వేల ఏకరాలకైనా జీలుగ అవసరం ఉంటుంది. నెలాఖరుకైన రైతుల చేతికి సబ్సిడీ జిలుగ విత్తనాలు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు.
సబ్సిడీపై..
ప్రతి వానాకాలం సీజన్ ముందు రైతులకు అందజేసే జీలుగ విత్తనాల సబ్సిడీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.గత రెండేళ్లుగా 60-65 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చారు. కిలో ధర ఖరారైతే కానీ ఎంత అనేది తమకు సమాచారం ఉండదని సంబంధించిన అధికారులు పేర్కొంటున్నారు.
Spread the love