
మండలం లోని తిమ్మాపురం యూపీఎస్ నందు గణితం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న నకిరేకంటి సైదులు పాఠశాలకు వస్తుండగా మండలం బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదం లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి మిర్యాలగూడ ప్రభుత్వ వైద్యశాల లో పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ బాలాజీ నాయక్ , దిలావర్పూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సైదా నాయక్, PRTU జిల్లా నాయకులు గుడిపాటి కోటయ్య, దామరచర్ల బాధ్యులు మందుల అశోక్, సైదిరెడ్డి, వెంకటరెడ్డి, రవీందర్, కుర్ర బిక్షం, హరి, శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నక్క నాగరాజు, శ్రీనివాస్ నాయుడు ఉపాధ్యాయులు ఉన్నారు.