నవతెలంగాణ – డిచ్ పల్లి : ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ చింతల కిషన్ పేర్కొన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో తీజ్ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని భోగ్ బండర్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గత కొన్ని రోజుల క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పాల్గొని పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు వారి అవసరాలను నెలకొల్పటానికి కృషి చేస్తానన్నారు.
ప్రతి పండుగ సమయంలో పాఠశాలలు కళాశాలలో సెలవులు లేకపోవడంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఆ పండగలో పాల్గొనలేక పోతున్నారని, ఇలా అన్ని పండగలను వసతి గృహాల్లో చేస్తే పండగ వాతావరణం ఉంటుందన్నారు. గిరిజన్లో తీజ్ పండగ సంస్కృతికి చిహ్నమని సూచించారు. అంతకుముందు విద్యార్థి నులు గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.ఈ సమావేశం లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా బాధ్యులు మోహన్ నాయక్, జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్, మండల బాధ్యులు తుకారం నాయక్, సోముల నాయక్ అనిల్ నాయక్,అంబర్ సింగ్,శివారం మహారాజ్ , తోపాటు గిరిజన నాయకులు, ప్రిన్సిపాల్ పద్మజా,అద్యపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



