– ప్రత్యేక అధికారి ఎం. భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం దుబ్బపేట గ్రామపరిధిలోని కస్తూరిబ్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లుగా పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం పాఠశాలలో 6వ తరగతిలో 40 సీట్లు,7వ తరగతిలో 20 సీట్లు, 8వ తరగతిలో 10 సీట్లు, 9వ తరగతిలో 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో సిఈసీలో 40 సీట్లు, ఎంపీహెచ్ డబ్ల్యూలో 40 సీట్లుఉన్నట్లుగా, విద్యార్థినులకు అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి, అనుభవజ్ఞులైన, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా నాణ్యమైన బోధన అందించబడునని పేర్కొన్నారు.తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను వెంటనే అడ్మిషన్ చేయించగలరని కోరారు.పూర్తి వివరాలకు 8106613775,9676845153,9704810287 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని కోరారు.
కస్తూర్బాగాంధీ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



