Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి  : జిల్లాలో ఎక్కడ కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంక రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో విత్తనాల ఎరువులు డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకాలైన వరి విత్తనాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఎక్కడ  కల్తీ విత్తనాలు అమ్మిన వాటిని ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని  తెలిపారు. పత్తిలో హెచ్డి కాటన్ ప్రభుత్వ నిషేధించిందని తెలియపరిచారు. దీనిని ఎక్కడ కూడా జిల్లాలో అమ్మరాదని ఆదేశించారు. యూరియా కి సంబంధించి అందరూ  యూరియాను యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియాని ప్రోత్సహించాల్సిందిగా అందరి డీలర్లని ఆదేశించారు. క్యాన్సర్ కారకమైన యూరియాని తగ్గించాలని డీలర్ల అందరిని కోరారు.  రైతులని అవగాహనపరిచి యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ రమణారెడ్డి, సహాయవ్యాప్ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ అధికారులు విత్తనా  ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -