క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం

నవతెలంగాణ-సిటీబ్యూరో
–  ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీదీప్‌ భట్టాచార్య మరింత బలోపేతం దిశగా కార్యాచరణ

దేశంలో బీజేపీ మతోన్మాదం పెరుగుతోందనీ, విద్యావ్యవస్థలోనూ జొరబడి ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగాలతో చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న మతోన్మాద చర్యలను అడ్డుకోవాలని అన్నారు. దీనికి విద్యార్థులుగా తాము పోరాడుతున్నామని, అన్ని రంగాల ప్రజలను కలుపుకుపోవడం ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చని తెలిపారు. దేశంలో ఏమి జరుగుతుందో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు ఎక్కువ తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలో అందరం కలిసి పోరాడటం ద్వారా బీజేపీని అడ్డుకోవాలని సూచించారు.
బెంగాల్లో తృణమూల్‌ గూండాగిరీ, మతోన్మాద బీజేపీ దాడులను ఎదుర్కొంటున్నామనీ, అదే సమయంలో కార్యకర్తలు, వాలంటీర్లు కష్టపడి ఏర్పాట్లను పూర్తి చేశారని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీదీప్‌ భట్టాచార్య తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ సందర్భంగా తొలిరోజు ఆయన మాట్లాడారు. తీవ్ర ఒత్తిడుల మధ్య ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బెంగాల్లోని మిడ్నాపూర్‌లో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ మరోసారి ఇక్కడ జరగడం అనందంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో తృణమూల్‌ దాడులను ఎదుర్కొంటున్నామని వివరించారు. వామపక్ష ఉద్యమంలో బెంగాల్‌కు ముఖ్యంగా హౌరా ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు అనంతరం ఇటీవల కాలంలో బలోపేతమవుతోందని పేర్కొన్నారు. ఏర్పాట్ల విషయంలో అన్నివైపుల నుంచి ఒత్తిడి వచ్చిందనీ, అయినా తాము ముందుకు వెళ్లామని చెప్పారు. వేదికలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిరాకరించిందని, ఇచ్చిన వారిపైనా ఒత్తిడులు పెంచిందని వివరించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తాము మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినా ఏర్పాట్లలో స్వల్ప లోపాలు ఏర్పడ్డాయనీ, వాటిని అధిగమించామని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బెంగాల్లో ముఖ్యంగా కోల్‌కతా, హౌరా లాంటి నగరాల్లో ప్రస్తుతం భయానక వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రజాతంత్ర ఉద్యమాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, కార్యకర్తలను, నాయకులను కోల్పోతున్నామని చెప్పారు. ప్రశ్నిస్తే చంపడం, దాడులు చేయడం తృణమూల్‌ పనిగా పెట్టుకుందని అన్నారు. వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నామన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు ఐద్వా బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి కనినిక ఘోష్‌ బోస్‌
బెంగాల్లో సుదీర్ఘకాలం తరువాత జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో ఐద్వా తరుపున సౌహార్థ్ర సందేశం ఇవ్వడం సంతోషంగా ఉన్నదని ఐద్వా జాతీయ నాయకులు, బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి కనినిక ఘోష్‌ బోస్‌ అన్నారు. ఎఐఏడబ్ల్యూఏ మహాసభలో బుధవారం ఆమె సౌహార్థ్ర సందేశం ఇచ్చారు. దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయనీ, ముఖ్యంగా వ్యవసాయ కార్మిక రంగంలో ఉన్న మహిళలపై వీటి ప్రభావం ఎక్కువగా పడుతోందని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక అసమానతల ప్రభావం కూడా మహిళలపైనే ఎక్కువగా ఉంటోందని తెలిపారు.

Spread the love