తెలుగులో రాలేదు

శివ కందుకూరి, రాశి సింగ్‌ జంటగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 31న రిలీజ్‌ కానుంది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర బృందం శనివారం నిర్వహించింది.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ,’ఈ టీజర్‌ను బిగ్‌ స్క్రీన్‌ పై చూడటం చాలా ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్స్‌ కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమా అవుట్‌ఫుట్‌ కోసం చాలా ఖర్చుపెట్టారు. హీరో తేజ సజ్జ, నిర్మాత రాహుల్‌ యాదవ్‌, హీరో తిరువీర్‌కి కతజ్ఞతలు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఒక మంచి సినిమాను మీకు ఇవ్వబోతున్నాం. ఈ సినిమా చూసి మీరొక క్రేజీ ఫీలింగ్‌తో బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నాకు మంచి రోల్‌ ఇచ్చారు. ఈ స్టోరీ వినగానే నా పాత్ర, ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందనిపించింది’ అని హీరోయిన్‌ రాశి సింగ్‌ అన్నారు. డైరెక్టర్‌ పురుషోత్తం మాట్లాడుతూ,’ఈ కథ రాయడానికి మెయిన్‌ రిజీన్‌ ప్రొడ్యూసర్‌ రాహుల్‌ యాదవ్‌. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్‌ నాకు మంచి ఫ్రీడమ్‌ ఇచ్చారు. మా హీరో శివ కందుకూరి ఫస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌. ఆయన ఒక అసోసియేట్‌ డైరెక్టర్‌లా హెల్ప్‌ చేశారు. ఈ సినిమాని చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ప్రొడ్యూసర్‌ స్నేహాల్‌ మాట్లాడుతూ, ‘ఈ పూర్తి స్క్రిప్ట్‌ను నాకు డైరెక్టర్‌ ముందే పంపించాడు. శశిధర్‌, కార్తీక్‌, నేను 150 పేజీల వరకు చదివి ఇది చేయాలని ఫిక్స్‌ అయిపోయాం. డైరెక్టర్‌ పురుషోత్తం వెరీ టాలెంటెడ్‌. సినిమా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు.

Spread the love