పిచ్చికుక్కలు స్వైర విహారం..

– పది మందిపై దాడీ.. ఒకరి పరిస్థితి విషమం
– భయాందోలన లో గ్రామస్తులు
– గత 20 రోజులు క్రితం పిచ్చి కుక్క కాటుకు తుడుం నరేందర్ మృతి
నవతెలంగాణ -పెద్దవూర
గత 20 రోజుల క్రితం కాంగ్రెస్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ తుడుం నరేందర్ పిచ్చి కుక్కకాటుకు మృతి చెందిన విషయం మరువ ముందే మల్లీ ఒకటికాదు రెండుకాదు ఏకంగా ఐదు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి అరగంట వ్యవధిలోనే 10 మందిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన బుధవారం రాత్రి నల్గొండ జిల్లా జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెదవూర మండలం పోతునూరు గ్రామం లో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం తొలుత ఒక పిచ్చి కుక్కపోతునూరు. గ్రామం లో సంచరిస్తూ కంటికి కనబడ్డ వారందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఆతరువాత వెంటనే మరో నాలుగు కుక్కలు వచ్చి నడుచుకుంటూ వెళుతున్న, వాహనాల పై వెళుతున్న, వ్యవసాయ పొలాలకు వెళుతున్న వారిపై, మహిళల పై దాడి చేసి 10 మందిని గాయ పరిచ్చాయి.గాయపడ్డ వారిలో మారెపల్లి మల్లయ్య, ఎలిజాల చంద్రయ్య, ఇన్ ఫాముల విశ్వనాదం, తుమ్మ పాపయ్య, పెండ్యాల నర్సింహారావు, ఎరుకల సైదమ్మ, మారపల్లి బిక్షం, పెండ్యాల సరస్వతమ్మ, తుమ్మ రూతమ్మ, మరో కొంతమందని గాయపర్చింది. మారేపల్లి మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండడం తో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికీ తరలించారు. మిగిలిన వారిని సాగర్ ఏరియా ఆసుపత్రికీ తరలించారు.మండలం లోని పెద్దవూర, బసిరెడ్డి పల్లి, చింతపల్లి, వెల్మగూడెం, బట్టుగూడెం, చలకుర్తి, గర్నెకుంట, పులిచర్ల, నాయినవాని కుంట, పోతునూరు, కొత్తలూరు, పాల్తీ తండా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం లో 50నుంచి 100 కు పైగా కుక్కలు ఆయా గ్రామాల ప్రజలను బేంబేలెత్తిస్తున్నాయు. ప్రతి గ్రామం లో కుక్కలను నియంత్రణ చేయక పోవడం తో పోతునూరు లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ అరగంట సమయంలోనే 10 మందిని పిచ్చికుక్క గాయపర్చింది. అనంతరం తండా ప్రజలంతా కలిసి ఒక పిచ్చికుక్కను హతమార్చారు. మిగిలిన కుక్కలు పరుగేత్తాయి.వెంటనే స్పందించి గాయపడిన వారిని కొందరిని పెద్దవూర, నగార్జున సాగర్ ఆసుపత్రికీ తరలించారు. అక్కడ వారికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం చేసి 10 మందిని గాయపర్చిన సంఘటనతో మండలంలోని అన్నీగ్రామాల్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో కుక్కల బెదడ ఎక్కువైదని వాటిని అరికట్టాలని సంబంధిత అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు.

Spread the love