పంచాయతీరాజ్‌శాఖకు ప్రాధాన్యం

– రూ.31,426 కోట్ల కేటాయింపులు
– ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు నేరుగా ఖాతాల్లోకి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం లభించింది. ఎస్సీ సంక్షేమ ప్రత్యేక నిధి(రూ36,750 కోట్లు) తర్వాత అత్యధికంగా ఈ శాఖకే కేటాయింపులు దక్కాయి. పంచాయతీరాజ్‌ శాఖకు మొత్తంగా రూ.31,426కోట్ల కేటాయిం పులు జరిగాయి. విడిగా చూసినప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహణ పద్దుకు రూ.9,072.34 కోట్లు, ప్రగతి పద్దుకు రూ.52 96.89 కోట్లు దక్కాయి. గ్రామీణాభివృద్ధికి నిర్వహణ పద్దు కింద రూ.58.91 కోట్లు, ప్రగతి పద్దు కింద 12,434.30 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి విడుదల చేసే పట్టణ, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్‌, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగబోతుందని మంత్రి హరీశ్‌రావు సభలో చెప్పారు. ప్రతి ఏటా పంచాయతీరాజ్‌ శాఖకు భారీ ఎత్తున నిధులు కేటాయింపులు జరుగుతున్నా తమకేమీ పెద్దగా ఉపయోగపడటం లేదని సర్పంచ్‌లు, ఎమ్‌పీటీసీలు, జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.250 కోట్లను మాత్రమే విడుదల చేసిందనీ, తమకు ఎలాంటి సంబంధం లేకుండా విద్యాకమిటీ ద్వారా మన ఊరు-మనబడి పథకానికి ఖర్చుపెడు తున్నారని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాపోతు న్నారు. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను ఫ్రీజింగ్‌లో పెట్టకుండా, నెలల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ప్రజా ప్రతినిధులు వేడుకుంటున్నారు. పింఛన్ల కోసం ఆసరా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులను పెంచుకుంటూ పోతున్నది. గత బడ్జెట్‌లో ఆసరాకు రూ.11,728 కోట్లు కేటాయించగా…ఈసారి దాన్ని రూ.12 వేల కోట్లకు పెంచింది.

Spread the love