పూరీ జగన్నాథుడి మహోత్సవాలకు 315 ప్రత్యేక రైళ్లు..

నవతెలంగాణ – ఢిల్లీ: పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర మహోత్సవాలు జులై 6 నుంచి జులై 19 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 315 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి, డిప్యూటీ సీఎంలు కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాచారమందించారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్; గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

Spread the love