భారత్ 32 పరుగుల.. వెనుతిరిగిన ఓపెనర్లు

నవతెలంగాణ – హైదరాబాద్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బ్యాటర్లు తడబాటు కొనసాగుతూనే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌటై జట్టు ఇప్పటికే ఇక్కట్లలో పడింది. బౌలర్ల ప్రతిభతో ఆస్ట్రేలియాను 200ల్లోపే కట్టడి చేయడంతో రెండో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 88 పరుగులు లోటు స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు.
ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ  మళ్లీ నిరాశ పరిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే గిల్ (5) నేథన్ లైయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ (12) సైతం 15వ ఓవర్లో లైయన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 32 పరుగులకే భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలా పడింది. ప్రస్తుతం పుజారా, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

Spread the love