సెర్ఫ్‌ ఉద్యోగుల పే స్కేలు ప్రకటించడం హర్షనీయం : జేఏసీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సెర్ప్‌ ఉద్యోగులకు ఏప్రిల్‌ నుంచి పే స్కేల్‌ వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సెర్ప్‌ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు కుంట గంగాధర్‌ రెడ్డి, నరసయ్య, సుదర్శన్‌, మహేందర్‌ రెడ్డి, సుభాష్‌, వెంకట్‌, సురేఖ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 23 ఏండ్ల నుంచి చాలీచాలని వేతనాలతో గ్రామీణాభివృద్ధి కార్య క్రమాల అమలులో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న తమకు ఎట్టకేలకు గుర్తింపు దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పేస్కేలు ద్వారా సెర్ప్‌ సంస్థలో పనిచేస్తున్న 3974 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ప్రస్తు తం వేతనాలకు ఏటా రు. 192 కోట్ల బడ్జెట్‌ ఉండగా దీనికి మరో 42 కోట్లు అదనంగా కేటాయిస్తే సరిపోతుందని పేర్కొ న్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, హరీశ్‌రావు, కేటీఆర్‌ లను కలిసి తమ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతామని వెల్లడించారు.

Spread the love