సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలి

– జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బంజారా లంబాడీల ఐక్యవేదిక నాయకులు
నవతెలంగాణ- కంటేశ్వర్
బంజారా(లంబాడీల) ఆరాధ్య దైవం సంత్ శ్రీ  సేవాలాల్ మహారాజ్ జయంతిని15 ఫిబ్రవరి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈసారి కూడా జరుపబోయే 284 వ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని లంబాడిల ఐక్యవేదిక తరపున సోమవారం జిల్లా కలెక్టర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో లైవ్ ఉమ్మడి నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధ్యక్షుడు కాట్రోత్ రవీందర్ నాయక్ జిల్లా ఇన్చార్జ్ మాలోత్ విట్టల్ నాయక్ జిల్లా మీడియా ఇంచార్జ్ అశోక్ వర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love