Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందశాతం ధాన్యం సేకరణ పూర్తి

వందశాతం ధాన్యం సేకరణ పూర్తి

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మెండయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు

ప్రభుత్వ లక్ష్యానికి మించి తాడిచెర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ రబి సీజన్లో వందశాతం వరిదాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరిగిందని తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య తెలిపారు.శుక్రవారం పిఏసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మండలంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13 వరిదాన్యం కొనుగోలు కేంద్రాల్లో వందశాతం ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఒక లక్ష క్వింటాళ్ళు ధాన్యం సేకరించాలనే లక్ష్యం పెట్టుకొని మండలంలో మొత్తం 1,235 మంది రైతుల నుంచి 1,10,899 క్వింటాళ్ల ధాన్యం సేకరించడం జరిగిందని తెలిపారు.సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.26,27,50,498 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.18,78,88,939 కోట్లు చెల్లించారని,మిగతా రూ.7,48,66,83,559 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.త్వరలోనే రైతుల ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.ధాన్యం సేకరణలో భాగంగా అడగగానే రైస్ మిల్లులు ఆలాట్ చేసిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ధాన్యం సేకరణలో ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ చేస్తూ కొనుగోళ్లు వేగంగా సేకరించాని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,డిసిఓలకు,సిఈఓలకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -