Friday, June 12, 2026
E-PAPER
Homeమానవిరక్తం పెంచే సూపర్ చెట్నీ

రక్తం పెంచే సూపర్ చెట్నీ

- Advertisement -

బీట్రూట్.. చాలా మందికి నచ్చదు. కానీ దీనిలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారు దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో ఉపయోగం. అలాంటి ఈ బీట్ రూట్ తో ఎంతో రుచిగా పచ్చడి చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతుంది. పచ్చిమిర్చి, అల్లం, చింతపండును వాడి ఈ పచ్చడిని తయారు చేస్తారు.బీట్రూట్ చట్నీకి
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, పచ్చి మిర్చి, నాలుగు టమాటాలు, వెల్లుల్లి, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పల్లీలు, ఇంకా నూనెను కూడా తీసుకోవాలి.
తయారీ విధానం : ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడైన తర్వాత దీనిలో బీట్ రూట్ ముక్కలు, పచ్చి మిర్చి, ఇంకా నాలుగు టమాటాలు కూడా వేసి మగ్గించాలి. ఇంకా దీనిలో కొద్దిగా చింత పండు కూడా వేసి వాసన పోయే వరకు బాగా మగ్గించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అయితే, ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేయించిన పల్లీలు, మగ్గించిన పచ్చిమిర్చి, బీట్ రూట్ ముక్కలు, టమాటాలను వేసి బాగా నూరుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని వేడైన తర్వాత మినపప్పు , వెల్లుల్లి, ఇంకా కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఆకులు , ఇంకా ఎండు మిర్చిని కూడా వేసి వేయించాలి.ఈ తాలింపును తీసుకుని బీట్రూట్ పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి మీరు టేస్టీ టేస్టీగా తినాలంటే దనాలుగు ఉల్లిపాయలు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -