దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వేలల్లో కాకపోయినా రోజూ పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు నాలుగున్నర కోట్లకు చేరింది. అందులో దాదాపు 98.79 శాతం మంది మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,393 మాత్రమే ఉన్నదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఈ సంఖ్య 13,037గా ఉన్నదని పేర్కొన్నది. కొత్తగా నమోదైన కరోనా ఇన్‌ఫెక్షన్‌ల కంటే రికవరీలు పెరుగడంతో ఇవాళ యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Spread the love