నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయ బృందం భద్రపరిచారు. ఈనెల 18 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ముందుగా వాటిని భద్రపరిచి సీల్ వేశారు. ప్రశ్న పత్రాలు భద్రపరిచిన వారిలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, తాడు బిలోలి ప్రధానోపాధ్యాయురాలు రేఖ, పిఆర్టియు మండల అధ్యక్షులు టి .సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు ఆనంద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.