జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి‌

– రూ.1.6 లక్షల కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ ) వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వరుసగా మూడో మాసంలోనూ పన్ను వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటా యని కేంద్ర రెవెన్యూ విభాగం కార్య దర్శి సంజరు మల్హోత్రా అన్నారు. 2022 ఆగస్టులో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని పేర్కొన్నారు. నిబంధనలకు లోబడి చెల్లింపులు పెరుగుతున్నాయని, పన్ను ఎగవేతలు తగ్గుముఖం పట్టాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లలో రెండంకెల వృద్థి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం పెరిగి రూ.3,479 కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2022 ఆగస్ట్‌లో ఇక్కడ రూ.3,173 కోట్ల వసూళ్లు జరిగాయి. గడిచిన నెలలో తెలంగాణలో 13 శాతం పెరిగి రూ.4,3993 కోట్ల జీఎస్టీ వసూళ్ల య్యింది. గతేడాది ఇదే నెలలో రూ.3,871 కోట్లుగా చోటు చేసుకుంది.
తగ్గిన విదేశీ మారకం నిల్వలు..
భారత విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఆగస్ట్‌ 25తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 30 మిలియన్‌ డాలర్లు పతనమై 594.85 బిలియన్లుగా నమోదయ్యాయని ఆర్‌బిఐ గణంకాలు తెలిపాయి. ఇంతక్రితం వారంలోనూ రికార్డ్‌ స్థాయిలో 7.28 బిలియన్లు కరిగిపోయాయి. సమీక్షా వారంలో ఐఎంఎఫ్‌ వద్ద భారత నిల్వలు 12 మిలియన్లు తగ్గి 5.06 బిలియన్లుగా ఉన్నాయి.

Spread the love