మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో అధిక శాతం హింసాకాండలో ప్రభావితమైన బాధితుల నుండి వచ్చాయని అన్నారు. మరికొన్నింటిని కొండ, లోయ ప్రాంతాల్లోని పౌర సమాజ బృందాలు దాఖలు చేశాయని చెప్పారు. ఇప్పటి వరకు అందిన అన్ని అఫిడవిట్‌లను సిఒఐ పరిశీలించిందని, హింస ఇతర సంబంధిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు మణిపూర్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో స్పందన కోరనుందని ఆ అధికారి తెలిపారు. నివేదికను ఖరారు చేసే ముందు ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులతో సహా సాక్షులను కూడా విచారించాలని సిఒఐ భావిస్తోందని అన్నారు.

 

Spread the love