బంగ్లాదేశ్‌లో రెండు రైళ్ల ఢీ..15 మంది మృతి

న‌వ‌తెలంగాణ -బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో 15 మంది వరకు మృతి చెందగా, 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఏఎఫ్‌పీ సమాచారం మేరకు బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు… ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయి. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారి సాధిక్ రహ్మాన్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో సరిగ్గా లేని సిగ్నల్ వ్యవస్థ, నిర్లక్ష్యం, పాత ట్రాక్స్ వల్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Spread the love