నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిందనీ, గ్రూపు-1 నోటిఫికేషన్ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ విస్మరించడంతో ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మరోమారు నిరూపించారని తెలిపారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీన తెలంగాణ నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూపు-1 నోటిఫికేషన్ వేస్తామని అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు యువతను మోసం చేసిందని విమర్శించారు. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతున్నదని పేర్కొన్నారు.