రాకేష్ రెడ్డికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

– బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేష్ రెడ్డి
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
నల్లగొండ, ఖమ్మం, వరంగల్  పట్టభద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చింతల వెంకటేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి కావాలా ప్రభు త్వానికి డబ్బా కొట్టె వ్యక్తి కావాలా, విద్యా వంతుడు ప్రభుత్వాన్ని,ప్రశ్నించే, గొంతుక కావాలా, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం పట్ట భద్రులకు ఎంతైనా ఉందని అన్నారు.కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెల్యూర్ గవర్నమెంట్ అని, ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి 6నెలలు కావడం లేదని,  కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు రైతుల కన్నీళ్లు చూడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలు వడగానే రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసు కుంటాయని అతి కొద్ది కాలం లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రజలందరూ కెసిఆర్ నే కోరుకుంటున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రభుత్వం తో మాట్లాడి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న, ప్రయివేట్, ఇంటర్, డిగ్రీ కళాశాల,స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్్మెంట్ విడుదల చేయడం కానీ,నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం లో,రాకేష్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తాడని అన్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే పట్టభద్రులు అలోచించి సీరియల్ నంబర్ 3పై,1వ (మొదటి )ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ ఇబ్రహీం మాట్లాడుతూ స్నేహ శీలి, విద్యావంతుడు, ప్రశ్నించే గొంతుక, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని కొనియాడారు. ఆపదలో విద్యార్థులను సామాన్య ప్రజలను, సైతం ఆదుకున్న ఆపద్బాంధవుడు అని అటువంటి మేధావిని పట్టభద్రులందరు గుర్తించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శలు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అమరేందర్, కొలుపుల అమరేందర్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సురేష్ , మైనారిటీ నాయకులు,బబ్లులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love