తనిఖీల్లో..రూ.2 లక్షల 48వేలు పట్టివేత

– ఎన్నికల కోడ్‌ ను అందరు పాటించాలి
– పట్టణ సీఐ రాజేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఎన్నికల కోడ్‌ను అందరూ పాటించాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలియజే శారు. తాండూరు పట్టణ కేంద్రంలో గురువారం జరిగిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తుల నుంచి వేరు వేరుగా రూ.2లక్షల 48 వేల సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలలో ఉన్నందున తనిఖీలు ముమ్మరం చేసినట్టు తెలిపా రు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.లక్ష 12 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.లక్ష 36 వేలను పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మొత్తం రూ.2లక్షల 48 వేలను సీజ్‌ చేసి, స్క్రీనింగ్‌ కమిటికి అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ. 50 వేలకు మించి నగదును తరలించొద్దని సూచించారు. అంతకుమించి ఉన్న నగదుకు ఆధారాలు ఉండాలన్నారు.

Spread the love