జెండా పట్టు.. రూ. 200 కొట్టు..

 – స్వచ్ఛందంగా వచ్చేవారు కరువు..
 – పేరు నమోదు చేసుకుంటేనే కూలీ…
 – ఎన్నికల సిత్రాలు.. 
 – ప్రచారాల కోసం కూలీలు
నవతెలంగాణ- తంగళ్ళపల్లి : ఎన్నికలు వచ్చాయంటే కూలీలకు పండగ వాతావరణం నెలకొన్నట్టే. ఏ ఎన్నికలైనా సరే కూలీలకు నిత్యం పండగే. ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ పూర్తయి ఫలితాలు వచ్చేంతవరకు కూలీలకు తీరిక లేకుండా పోతుంది. పార్టీలవారు స్వతంత్ర అభ్యర్థులు ఇతరులు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూలీల కోసం వెతుకులాట మొదలుపెడతారు. రోజుకు 50 మంది 100 మంది తో ప్రచారం చేయడానికి కూలీలను ముందుగానే మాట్లాడుకొని అడ్వాన్సులు అందజేస్తారు. ఇక అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు వందల మందితో భారీగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ను వేస్తారు అందులో వచ్చిన వారంతా 80 శాతానికి పైగా కూలీలుగానే వస్తారు. ఒక్కరోజు ప్రచారం చేస్తే రూ.200 నుండి రూ.300 ల వరకు కూలీలకు కూలి అందజేస్తున్నారు. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలి వచ్చేవారు నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు.దీంతో అభ్యర్థులు, ఆశావాహుల సభల
కోసం, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు.
– ఇవాళ ఇక్కడ.. రేపు అక్కడ..
కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే రేపు మరో పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పలుచోట్ల చేరికల సందర్భంగానూ ఇలాంటి వింతలే జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకు నేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లేక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రికార్డు తే కానీ డొక్కాడని కూలీలకు ఎన్నికల పుణ్యమా అని ఎన్నికల అయ్యేంతవరకు కూలి దొరుకుతుంది. దీంతో వారి కుటుంబాలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తాయని పలువురు కూలీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర కూలీలకు వెళ్లేవారు. ఈ ఎన్నికల లో కూలి రావడంతో కూలీలకు చేతినిండా డబ్బులు కనిపిస్తాయి. ఇతర పనులకు వెళ్లే వారు, ఇంటి వద్ద ఉండే మహిళలు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, ఇతర పనులు చేసుకుంటూ జీవించేవారు కూడా ఎన్నికలు వచ్చాయి అంటే ఎన్నికల ప్రచారంలో కూలీలుగా వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచార కూలీలు ఉన్నారని ధీమాతో అభ్యర్థులు నిత్యం వందల మందితో ప్రచారం చేస్తూ ఉంటారు.
Spread the love