ఓటేసే ముందు.. నేస్తమా ఆలోచించు

నవతెలంగాణ- సిరిసిల్ల :
– పాలిచ్చే గేదె ధర లక్ష …ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క ఖరీదు 20 వేలు. మేకకు 10 వేలు… కానీ ఓటరుకు మాత్రం 500 లేదా 1000 అంటూ వాటికంటే అద్వానమై… మన హక్కును అమ్ముకుందామా…? అంటూ… ఓ మహిళ నిజాయితీగా ఓటేయాలని చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది….
– ఐదేళ్ల అధికారాన్ని ఇచ్చేందుకు వేసే ఓటుకు వెయ్యి తీసుకుంటూ… రోజుకు 54 పైసలు. ఇదే 500 తీసుకుంటే రోజుకు 27 పైసలు చొప్పున లబ్ధి చేకూరుతుంది. కానీ… ఇలా ఓటును అమ్ముకోవడం ద్వారా విలువైన వ్యక్తిత్వాన్ని… లాభాలను, అభివృద్ధిని కోల్పోతున్నామనే లిఖిత సందేశం వాట్సాప్ లలో చెక్కర్లు కొడుతుంది.
– మద్యం, మాంసం, డబ్బు, బంగారం, చీరలు.. సారెలు.. ఇలా మాకు ఏదీ వద్దు.. ప్రగతి కావాలంటూ మరో లిఖిత సందేశం వాట్సాప్ లలో చక్కర్లు కొడుతుంది.
నాయకులు ఇచ్చే తాయిలాల విషయంలో ఓటర్లు ఒకసారి ఆలోచించాలి మనం వేసే ఓటు రాజకీయ నాయకుడికి ఐదేళ్లపాటు ఉన్నత పదవిని అధికారాన్ని కట్టబెడుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి జనుల సామాజిక ఆర్థిక ఉపాధి ప్రగతి అవసరాలు పనులు చేసేందుకు కృషి చేయాలి ఈ నేపథ్యంలో ఓటర్ నిజాయితీగా జాగరుకతతో వ్యవహరించకపోతే నాయకులనుంచి మనము నిజాయితీ పాలనను ఆశించలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది
– ఎన్నికల వ్యయం..
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చేసే వ్యయం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎన్నికల సంఘం నిర్దేశించింది మరొకటి ఎన్నికల్లో పోటీ ఆధారంగా అభ్యర్థులు చేసేది ఓ సర్వే సంస్థ అధ్యయనంలో ఒక్కో ప్రధాన పార్టీ కోట్లకు మించి ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది వాస్తవానికి ఎన్నికల సంఘం ఒక్కో అభ్యర్థికి 40 లక్షలను గరిష్ట ఎన్నికల వ్యయంగా పరిమితి విధించింది కానీ ఈ ఖర్చు కేవలం నామినేషన్ ప్రక్రియ వరకు మాత్రమే సరిపోతుందని వాదన ఉంది దాదాపు నెల రోజుల కాలానికి అభ్యర్థులు కార్యకర్తలు ప్రచార రతాల నిర్వహణ సభలు సమావేశాలు ర్యాలీలు జెండాలు ఇతరాత్ర ఖర్చులతో పాటు మద్యం విందు ఇతర తాంబూలాలు నగదు పంపిణీ చేయడం లాంటి ఖర్చులు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే ఎన్నికల సంఘం ఎంత కట్టడి చేసినప్పటికీ ఈ ప్రలోభాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ఇందుకు బరిలో ఉన్న అభ్యర్థులు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఓటర్లే చైతన్యవంతులై ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా సమర్ధులను గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత ఓటర్ల పైనే ఉంది ఈ క్రతువులో యువ ఓటర్లు మరింత చైతన్య శీలురు కావలసిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
– రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాసనసభ నియోజకవర్గాలు…..02
– పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు…03
– మూడు ప్రధాన పార్టీలనే పరిగణిస్తే పోటీ పడే అభ్యర్థులు…06
– 40 లక్షలతో అయితే ఆరుగురు చేసే ఖర్చు…2.40 కోట్లు
– ఓ సర్వే సంస్థ అధ్యయనం ప్రకారం వ్యయం…120 కోట్లు

Spread the love