ఎంపీ దత్తత గ్రామంగా నర్సింహుల పల్లి

– సంసద్ ఆదర్శ గ్రామ పంచాయతీ యోజనలో ఎంపిక
– గ్రామాభివృద్ధి పనులపై అయా శాఖాధికారుల సమావేశం
నవతెలంగాణ – బెజ్జంకి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంసద్ ఆదర్శ గ్రామ పంచాయతీ యోచనలో భాగంగా మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామాన్ని కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ బండి సంజయ్ దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సంసద్ ఆదర్శ గ్రామ పంచాయతీ యోజనలో నర్సింహుల పల్లి గ్రామాభివృద్ధికి చేపట్టే పలు అభివృద్ధి పనులపై అయా శాఖల అధికారులతో డీప్యూటీ డీపీఓ ఓబులేసు సమావేశం ఏర్పాటుచేసి సమీక్ష నిర్వహించారు.గ్రామంలోని అసంపూర్తి పనులను గుర్తించి వివిధ శాఖల నిధులతో పూర్తి చేసేల ప్రణాళిక చేపడతామని ఓబులేసు తెలిపారు. ఎంపీపీ నిర్మల, ఎంపీడీఓ దమ్మని రాము, ఎంపీఓ విష్ణు వర్థన్, సర్పంచ్ కుసుంబ అంజవ్వ, ఎంపీటీసీ కొలిపాక రాజు, ఉప సర్పంచ్ కుంట హారీశ్, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Spread the love