మూడో టర్మ్ తపన తప్ప కేసీఅర్ వేరే ఆలోచన లేదు 

– మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం 
నవ తెలంగాణ వీర్నపల్లి 
రెండు సార్లు పూర్తీ చేసినా మూడో టర్మ్ సీఎం గా నేనే ఉండాలని తపన తప్ప వేరే ఆలోచన లేదని మాజి ఎమ్మెల్యే బిజేపి రాష్ట్ర నాయకులు మృత్యుంజయం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం సోమవారం రంగం పేట గ్రామంలో ఇటివల మృతి చెందిన భూక్య ప్రవీణ్ కుటుంబ సభ్యులను, వన్ పల్లి గ్రామంలో దాసరి విజయ అప్పుల బాధ ఆత్మ హత్య చేసుకున్న కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం పరామర్శించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సార్లు ముఖ్యమంత్రి గా ఉండి తెలంగాణ కొసం బలిదానం చేసిన 1300 మంది యువకులను అధుకొలేదు దాదాపు 400 మంది యువకులను అదుకొని ప్రాణ త్యాగం చేసిన యువకుల కుటుంబాలకే ఇప్పటి వరకు ఏమి చేయలేదు తెలంగాణకు ఏమి చేస్తాడు. రెండు దఫాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఎ ఒక్కటీ అమలు చేయలేదని మాటలు తప్ప బి అర్ ఎస్ పార్టి చేసింది ఏమిలేదన్నరు. వీర్నపల్లి ని దత్తత తీసుకొని అభివృద్ది చేసామని చెపుతున్నారు కాని అభివృద్ది ఎక్కడ కనబడత లేదనీ విమర్శించారు. ఈ ప్రాంతం అంతా వ్యవసాయం అనుకూలం రైతులకు ప్రోత్సాహం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులను పరిహారం ఇవ్వడం లోనే రైతుల పట్ల ఎంత శ్రద్ద ఉందో అర్థం అవుతుందన్నారు. వాగు ల పై బ్రిడ్జి ఇంత వరకు నిర్మాణం చేపట్టక పోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి ఓ బి సి రాష్ట్ర కార్య వర్గ సభ్యులు నవీన్ యాదవ్, బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రభాకర్, రాజ సింగ్, బిజేపి మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మాజి మండల అధ్యక్షులు మల్లేశం, మండల జనరల్ సెక్రటరీ మహేష్, జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మరెడ్డి , నాయకులు సంజీవరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love