ఘనంగా ముగిసిన మొహర్రం వేడుకలు

– పీరీలతో అగ్నిగుండంలో దూకుతున్న పూనకం వచ్చినవారు
నవ తెలంగాణ-రామగిరి
రామగిరి మండల వ్యాప్తంగా ఆఖరి రోజైనా మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు గత తొమ్మిది రోజులుగా గ్రామాలలో జరుగుతున్నాయి. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే ఈ పండుగ వేడుకలు అమావాస్య తెల్లారి మొదట పీరీలను నిలబెట్టే కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం 7వ రోజు చిన్న సరగతు, 9వ,రోజు పెద్ద సరగతు పాటు పీరీల పూనకం వచ్చినవారు అగ్నిగుండంలో పీరీలతో సహా  దుంకుతారు. ఈ పండగ హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ వేడుకల్లో ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా నిర్వహిస్తారు. ఆయా  గ్రామాలలో నిర్వహించిన ఈ వేడుకలు ఆ గ్రామ సర్పంచులు అదేవిధంగా గ్రామ మసీదు పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

Spread the love