– శ్రీధర్ బాబు స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
నవతెలంగాణ-మంథని
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్చార్జిగా వ్యవహరించి,కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషిచేసి,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేలా శయ శక్తుల కృషిచేసి తిరిగి మంథని నియోజక వర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా కమాన్ పూర్ మండలం సబ్బితం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు,పెద్ద ఎత్తున స్వాగతం పలికే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గo. రాజేష్ కోరారు.శుక్రవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మండల అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యవసర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 21న సాయంత్రం నాలుగు గంటలకు మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలకడానికి వివిధ గ్రామాలు మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు,పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన అయిత.ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శశిభూషణ్ కాచే,అజీమ్ ఖాన్,మూస్కుల. సురేందర్ రెడ్డి,జంజర్ల శేఖర్,నూకలబానయ్య,ఓడ్నాల శ్రీనివాస్,మంథని సత్యం,వేల్పుల రాజు,మారుపాక నిహారిక, తోకలమల్లేష్,రావికంటి సతీష్,దొర గొర్ల శ్రీనివాస్,అక్క పాక సదానందం మంతెన శ్రీనివాస్,కిరణ్, అనిల్,తదితరులు పాల్గొన్నారు.