ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ధర్నా చేస్తున్న రైతులు

– ధాన్యం కొనుగోళ్ళ నిలిపివేతపై రోడ్డెక్కిన అన్నదాత
– తరుగు పేరిట పది కిలోలు కోతవిధి స్తున్నారని ఆగ్రహం
– వెంటనే కొనుగోలు చేపట్టాలని రాస్తారోకో
నవతెలంగాణ-మంథని
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు నిలిచిపోవడంతో మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.మంథని పెద్దపెల్లి రహదారిపై రైతన్నలు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడినే నిలిచిపోయాయి. అన్నదాతలు మండిపడుతూ ప్రధాన రహదారిపై ధాన్యాన్ని పారబోస్తూ ధాన్యానికి ప్రధాన రహదారిపై ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు,ప్రజలు, వాహనదారులు,తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాన్యం మార్కెట్ యార్డుకు తెచ్చి నెల రోజులు గడుస్తున్న కాంట వేయడం లేదని మండిపడ్డారు.వేసిన ధాన్యం కాంటాకు క్వింటాలకు10 కిలోల చొప్పున తరుగుతీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ధాన్యం నాణ్యత లేదని నల్లబడిందని రకరకాల కారణాలు చెప్పి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇప్పటికే రెండుసార్లు అకాల వర్షాల వల్ల దెబ్బతిని నష్టపోయామని చేతికి వచ్చిన పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే కాంట కొనసాగించాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలుచేయాలన్నారు.విషయం తెలిసిన మంథని ఎమ్మార్వో బండి ప్రకాష్,ఆర్ఐ రాజిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సర్దిచెప్పి ధాన్యం కొనుగోలు జరుపుతామని,కాంటా సజావుగా సాగుతుందని,తరుగు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో మంథని పరిసర గ్రామాల రైతులు,ప్రజలు,నాయకులు పాల్గొన్నారు.

Spread the love