మోడీ నిరంకుశ, అవినీతి పాలనను ప్రశ్నించాలి

– తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, ప్రొ. జి.హరగోపాల్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
పదేండ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు పాలనను, ఆర్థిక విధానాలను, అవినీతిని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశ్నించాలని తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ) రాష్ట్ర కన్వీనర్‌, ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ పిలుపునిచ్చారు.మే 13న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీపీజేఏసీ ఆధ్వర్యంలో మే 2 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార కార్య క్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌తో కలిసి ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికల్లో ప్రచారంలోకి తీసు కురాకుండా బీజేపీ నాయకులు, ప్రధాని మోడీ ముస్లింలు,మంగళ సూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ.. చర్చను పక్కదారి పట్టిస్తున్నారని విమ ర్శించారు.పదేండ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపో యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా మతం, దేవుడు, ముస్లింల పై విద్వేషం పునాదిగా మోడీ ప్రచారం సాగిస్తు న్నారని, దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్‌ రమా మేల్కొటె మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు కనీస నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. బెంగళూర్‌లో బీజేపీ భాగస్వామ్య పార్టీ నాయకుడు, ఎంపీ స్త్రీలపై జరిపిన లైంగిక దాడులు జుగుప్సాకరంగా ఉన్నాయని, అలాంటి వ్యక్తికి మోడీ ప్రచారం చేశారని విమర్శిం చారు.తెలంగాణ ప్రజలు మత సామరస్యంతో జీవించారని, ఇప్పడు ఆ వాతావరణం లో బీజేపీ నాయకులు విద్వేషం నింపేందుకు ప్రయత్ని స్తున్నారని,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ మాట్లాడుతూ.. మోడీ ఆర్థిక విధానాల వల్ల కొంత మంది దేశ సంపద దోచుకుని బిలియనీర్లుగా మారారని, పేదలు మరింత పేదరికం లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయ న్నారు.ఈ సమయంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రజలు చిత్తుగా ఓడించా లని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ నాయకులు కురుగంటి కవిత, టీపీజేఏసీ కో-కన్వీనర్లు కన్నెగంటి రవి, రవిచందర్‌, మైసా శ్రీనివాస్‌, బి.జ్యోతి, వి.కిరణ్‌ కుమార్‌, కరుణాకర్‌ దేశరు, నాయకులు ముత్తయ్య, రామగిరి, ప్రకాష్‌, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్‌ వనమాల, ప్రొఫెసర్‌ సుకుమార్‌,అనిశెట్టి శంకర్‌,మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు డాక్టర్‌ రుక్మిణీరావు, విరసం నాయకులు రాము పాల్గొన్నారు.

Spread the love