ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు

నవ తెలంగాణ-రామగిరి
రామగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకేషి రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి విద్యార్థులకు అరటి పండ్లు, స్వీట్లు, పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు మేదరవేణి కుమార్ యాదవ్, ఎంపీటీసీలు ధర్ముల రాజ సంపత్, కామ శ్రీను, పన్నూర్ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, నాయకులు కె భాస్కర్, బుర్ర శంకర్ గౌడ్, గాజుల ప్రసాద్, కొండవేన సుధాకర్ యాదవ్, కొండవేన ప్రభాకర్ యాదవ్, ఆసం తిరుపతి, గద్దల శంకర్, తదితర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Spread the love