సీబీఐపై మా నియంత్రణ లేదు

– సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: సీబీఐపై తమ నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కేంద్ర సంస్థ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 ప్రకారం.. కేంద్రంపై బెంగాల్‌ సర్కారు కేసు వేసింది. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్నా.. దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేస్తోందని ఆరోపించింది. కేసులను భారత ప్రభుత్వం దాఖలు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని ఎస్‌జీ తెలిపారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదని తెలిపారు. వాస్తవానికి 2018 నవంబర్‌ 16న బెంగాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి దర్యాప్తు చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంది. దీంతో బెంగాల్‌లో సీబీఐ దాడులు, దర్యాప్తులు చేయలేదు. అయితే, ఇటీవల ఈడీ బందంపై జరిగిన దాడిని సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. సందేశ్‌ఖాలీలో అక్రమ భూకజ్జా తదితర కేసులపై సైతం విచారణ జరుపుతుండగా.. బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Spread the love