కాంగ్రెస్ లో పప్పూయాదవ్ పార్టీ విలీనం

నవతెలంగాణ ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు నెల ముందే పప్పూయాదవ్ బుధవారం తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయన మంగళవారం సాయంత్రం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌లను కలిశారు. లాలూప్రసాద్‌తో నాకు రాజకీయ సంబంధాలు లేవని, ఓ ఆలోచనను పంచుకోవడం కోసం తామందరం కలిశామని ఆయన తెలిపారు. సీమాంచల్‌, మిథిలాంచల్‌లలో బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. తేజస్వి యాదవ్‌ పార్టీలో నమ్మకంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ హృదయాన్ని గెలుచుకున్నారు. మేము ఈ ఎన్నికల్లో మాత్రమే కాదు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తాము. బీజేపీ ఓటమి, బలహీనవర్గాల అభివృద్ధే మా ధ్యేయం అని పప్పూయాదవ్‌ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పోరాడతాం. ప్రజల హృదయాన్ని గెలుచుకున్నవారే ఈ దేశానికి ప్రధాని అవుతారు అని ఆయన పేర్కొన్నారు.

Spread the love